వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 8న రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ తెలిపారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ బంద్కు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు తెలిపారన్న ఆయన... సీఎం జగన్ కూడా రైతులకు మద్దతుగా స్వరం వినిపించాలని డిమాండ్ చేశారు.
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కూడా బయటకు రావాలని గఫూర్ అన్నారు. రైతులకు నష్టం కలిగించే నూతన చట్టాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలూ బంద్కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు బంద్కు రైతు సంఘాలిచ్చిన పిలుపునకు మద్దతుగా విజయనగరం కోట జంక్షన్ నుంచి కార్మిక, ఉద్యోగ, వామపక్ష సంఘాల నాయకులు రాలీ నిర్వహించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: