కర్నూలులో పౌర సరఫరాల శాఖ గిడ్డంగుల్లో పని చేసే కార్మికులు ధర్నాకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ అధ్వర్యంలో నిరసనకు దిగారు. కరోనా సమయంలో పని చేస్తున్న తమను ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తమ కూలి రేట్లు పెంచి, ప్రభుత్వం ఇచ్చే వసతులను కల్పించాలని హమాలీలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :