రాష్ట్రంలో తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించేందుకు ప్రతి శాసనసభ్యుడికి కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కర్నూలులో తాగునీటి సమస్య, వ్యవసాయంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించాలని గుర్తు చేశారు. కృష్ణానదిలో ప్రతి ఏడాదికి నీటి లభ్యత తగ్గిపోతోందన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల తదితర ఉత్పత్తుల పరీక్షలకు ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి... నంద్యాల రైల్వేస్టేషన్ తనిఖీ చేసిన డివిజనల్ మేనేజర్