కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ నిర్ణారణ కోసం ఇచ్చిన రక్త నమూనాలు కనిపించకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు రెండవ బెటాలియన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బందెనవాజ్కు కొవిడ్ లక్షణాలు ఉండడంతో ఈనెల 19న ఆసుపత్రికి వెళ్లారు. కరోనా పరీక్షల కోసం శ్యాంపిల్ ఇచ్చి ఎంఎం-4 వార్డులో చేరాడు.
నాలుగురోజులు గడిచినా ఫలితాలు రాకపోవడంతో బందెనవాజ్ కుటుంబసభ్యులు ల్యాబ్‌కు వెళ్లి విచారించారు. అతడి రక్త నమూనాలు తమ వద్దకు రాలేదని ల్యాబ్ నిర్వాహకులు తెలపడంతో విషయం బయట పడింది. దీంతో తిరిగి నేడు మళ్లీ రక్త నమూనాలు పరీక్షలకు పంపినట్లు బాధితుడి కుటుంబసభ్యులు వెల్లడించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితే ఇలా అయితే సామాన్యుల గతి ఎలా ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: