రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఈ వ్యాధితో ముగ్గురు మరణించారు. అధికారికంగా ఎక్కువ కేసులు నమోదుకాకపోయినా.. కొందరు ఇంటి వద్దే చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాధికి చికిత్స ఉందని.. భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే కీలకమైన 'ఆంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్' అందుబాటులో లేదని.. వివిధ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
బ్లాక్ ఫంగస్ బాధితులకిచ్చే 'ఆంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్' ధర సుమారు రూ. 8 వేలు. చికిత్స పూర్తయ్యేనాటికి కేవలం ఈ ఇంజక్షన్‌కే లక్షలు ఖర్చవుతోందని.. సామాన్యులు అంత వెచ్చించలేరు కాబట్టి.. బ్లాక్ మార్కెట్‌ను అరికడుతూనే అందుబాటు ధరలోకి తీసుకురావాలని ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తోంది. కరోనా చికిత్సలో స్టెరాయిడ్లను అధికంగా వినియోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకుంటే.. రెమ్‌డెసివిర్ లానే 'ఆంఫోటెరిసిన్-బీ' కొరత తలెత్తుతందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: