సొంత చెల్లికే న్యాయం చెయ్యలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS JAGAN)పై.. ప్రజలు ఏవిధంగా నమ్మకం పెట్టుకుంటారు.. అంటూ భాజపా (BJP) నేతలు కర్నూలులో వ్యాఖ్యానించారు. నగరంలో భాజపా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 2019 ఎన్నికల సమయంలో మంచి పాలన అందిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించారని.. జనతా కిసాన్ మోర్చా జాతీయ నాయకులు సురేష్ రెడ్డి(suresh reddy) అన్నారు. సొంత బాబాయ్ హత్యకేసును పరిష్కరించని వైకాపా ప్రభుత్వం.. ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ చెల్లి తెలంగాణలో రాజకీయాలు చెయ్యడం రాజకీయ కుతంత్రాలు కాదా అని ఆయన ప్రశ్నించారు.
రాయలసీమకు అన్యాయం జరుగుతోంది
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) ఆరోపించారు. తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలని చూస్తున్న అంశాన్ని.. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ(Telangana), ఏపీ(AP) తీసుకుంటున్న నిర్ణయాలతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. సీఎం జగన్(CM Jagan) రాయలసీమ హక్కులను ఫణంగా పెట్టి.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు.
హక్కులను కాలరాస్తున్నారు
అంతర్రాష్ట్ర జల వివాదాల(water disputes)పై తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వదిలేసి.. హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. శ్రీశైలంలో అక్రమ విద్యుత్ ఉత్పత్తిని.. అడ్డుకోవాలని సూచించారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య రహస్య ఒప్పందంతో.. ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:
pulichinthala project: ప్రభుత్వ విప్‌ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు