కర్నూలు సర్వజన వైద్యశాలలో ఇవాళ అపహరణకు గురైన 9 రోజుల పసికందును పోలీసులు క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. గోనెగండ్ల మండలం చిన్న నేలటూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు, మరియమ్మలకు 9 రోజుల క్రితం పెద్దాసుపత్రిలో ఆడ శిశువు జన్మించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మరియమ్మ ఇవాళ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి పెద్దాసుపత్రికి వచ్చారు. వైద్యుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఓ మహిళ బిడ్డను ఎత్తుకుని ఆడిస్తూ నమ్మకంగా వ్యవహరించింది. మరియమ్మ వైద్య పరీక్షల కోసం వెళ్లగా... ఆమె బంధువుల కళ్లుగప్పి బిడ్డను అపరిచించింది. విషయం తెలుసుకున్న పోలీసులు జిల్లా అంతటా గాలింపు చర్యలు చేపట్టారు. ప్యాపిలిలో చంద్రకళావతి అనే మహిళ వద్ద పాపను గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.
కర్నూలులో పసికందు కిడ్నాప్ కేసు సుఖాంతం
కర్నూలులో 9 రోజుల పసికందు కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించటంతో కొన్ని గంటల్లోనే ఆ చిన్నారి తల్లి ఒడికి చేరింది.

ఇదీ చదవండి