సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఉద్యోగుల ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి అన్నారు. తెదేపా నాయకులు ఉద్యోగులను రాజీనామా చేయమని చెప్పారని.. ఉద్యోగులు రాజీనామా చేస్తే తెదేపా కార్యకర్తలతో ఎన్నికలు నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సానుకూలంగా ఉన్నారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: జంట హత్యల కేసు: వెలుగులోకి కొత్త నిజాలు..