కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా ...వాారిని కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. వాహన వేగాన్ని అదుపులో ఉంచుకుని... ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడే ప్రమాదాలు నివారించగలుగుతామన్నారు. ద్వి చక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు...తూఫాను వాహనాన్ని ఢీకొట్టిందన్నారు. ద్వి చక్ర వాహనంపై ఉన్న వ్యక్తి సైతం ఈ ప్రమాదంలో మృతి చెందాడని కలెక్టర్ చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై ప్రయాణికుల్లో అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
బైక్పై ఉన్న వ్యక్తీ చనిపోయాడు: కర్నూలు కలెక్టర్
వెల్దుర్తి ప్రమాద క్షతగాత్రులను కర్నూలు సర్వజన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మృతుల బంధువుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. వారి రోదనతో ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిశ్చితార్ధం ఖాయమైన సంతోషంతో ఉన్న వారంతా.. ఒక్కసారిగా విగతజీవులుగా మారిన భయానక పరిస్థితుల్లో బాధితులు ఇంకా షాక్ లోనే ఉన్నారు.
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా ...వాారిని కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. వాహన వేగాన్ని అదుపులో ఉంచుకుని... ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడే ప్రమాదాలు నివారించగలుగుతామన్నారు. ద్వి చక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు...తూఫాను వాహనాన్ని ఢీకొట్టిందన్నారు. ద్వి చక్ర వాహనంపై ఉన్న వ్యక్తి సైతం ఈ ప్రమాదంలో మృతి చెందాడని కలెక్టర్ చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై ప్రయాణికుల్లో అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
contributor: arif, jmd
డిగ్రీ లోనే 5 ఉద్యోగాలు
( ) పెద్ద పెద్ద చదువులు చదివి ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకునేవారికి ఈ పేదింటి బిడ్డ ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగం పొందడానికి ఉన్నత చదువులు అక్కరలేదని నిరూపించి శభాష్ అనిపించుకుంది ఈ అమ్మాయి .ఈమె ప్రతిభకు ఉద్యోగ అవకాశాలు దాసోహం అయ్యాయి.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఉద్యోగాలు ఆమె తలుపులు తట్టాయి. చిన్నప్పటినుంచే పట్టుదలగా చదివి రాణించడమే ఇందుకు కారణం అంటోంది.
వాయిస్ ఓవర్1 కడప జిల్లా మైలవరం మండలం వేపరాల లో చేనేత కుటుంబానికి చెందిన బడి గింజల కృష్ణమూర్తి రుక్మిణి కుమార్తె ......భాగ్యలక్ష్మి , పదో తరగతి వరకు ఇక్కడే చదువుకుంది ...అనంతరం జమ్మలమడుగు లోని ఓ ప్రైవేట్ జూనియర్ ,డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరం లో 9.5 శాతం, రెండో సంవత్సరంలో 9.3 శాతం మార్కులు సాధించింది. ప్రస్తుతం మూడో సంవత్సరం పరీక్షలు రాసి పరీక్ష ఫలితాల కోసం భాగ్యలక్ష్మి ఎదురుచూస్తోంది. చదువుసాగిస్తూనే తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని ఇంట్లో దుస్తులు కుట్టడం, మగ్గం నేయడం చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా చదవడం ఆమె అలవాటు చేసుకుంది.
వాయిస్ ఓవర్2
ఈ ఏడాది జనవరి నుంచి తిరుపతిలో విప్రో , టిసిఎస్, కాకినాడలో క్యాప్ జెమినీ ,హైదరాబాద్ లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలు ఎంపికలు నిర్వహించాయి .రాసిన ప్రతి పరీక్షలోనూ భాగ్యలక్ష్మి విజయం సాధించింది .ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టాయి. కంపెనీలు ఆఫర్ లెటర్లు పంపాయి .ఏకంగా ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించడం తో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. భాగ్యలక్ష్మి ప్రతిభకు ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . డిగ్రీ ఫలితాలు వచ్చాక మంచి కంపెనీ ఎన్నుకుని అందులో చేరుతానని ఆమె చెబుతోంది.
బైట్ 1 బడిగించల భాగ్యలక్ష్మి, 5 ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థిని
2 రుక్మిణీ భాగ్యలక్ష్మి తల్లి
ఎండ్ వాయిస్ ఓవర్ కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని ఈ డిగ్రీ విద్యార్థిని నిరూపించింది .పెద్ద పెద్ద సంస్థలైన ఐదింటిలో ఉద్యోగానికి అర్హత సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.
Body:5 ఉద్యోగం సాధించిన భాగ్యలక్ష్మి
Conclusion:5 ఉద్యోగం సాధించిన భాగ్యలక్ష్మి