HC on MLA Katasani : పత్రికల్లో ప్రకటన ద్వారా కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేయాలంటూ హైకోర్టు ఈనెల 4న ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను ధర్మాసనం వెనక్కి తీసుకుంది. గతంలో ఆదేశించిన ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు అల్లూరి మల్లేశ్వరీ, ఎం.ఎన్ శశిధర్‌లకు పత్రికల్లో ప్రకటన ద్వారా నోటీసులు జారీ చేయాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కేసు విచారణను ఫిబ్రవరి ఏడో తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి : CBN Video Conference : అరాచకాలపై రాజీలేని పోరాటం చేయాలి -చంద్రబాబు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!