ETV Bharat / city

మురుగు గుంతలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి - కర్నూలు పట్టణం తాజా మరణం వార్తలు

ప్రమాదవశాత్తు ఓ మురుగు గుంతలో పడి నాలుగు ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. కాలనీ సమీపంలోని ఓ గృహ సముదాయ కాలనీకి చెందిన మురుగు గుంతలో శవమై కనిపించాడు. సమాచారం తెలుసుకున్న నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.

4 year kid fell down in drainage and died in kurnool town and panyam mla visited the place
మురుగు గుంతను పరిశీలిస్తున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని
author img

By

Published : Jul 5, 2020, 11:12 AM IST

కర్నూలు వీకర్​ సెక్షన్​ కాలనీలోని ఓ మురుగు గుంతలో పడి ముర్తుజావలి అలియాస్​ మున్నా (4) మృతి చెందాడు.షేక్​ హుస్సేన్​. రేష్మా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో మున్నా మొదటి సంతానం. శుక్రవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుతూ కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు రాత్రి వరకు గాలించినా జాడ తెలియలేదు. శనివారం మధ్యాహ్నం కాలనీ సమీపంలోని ఓ గృహ సముదాయ కాలనీకి చెందిన మురుగు గుంతలో శవమై కనిపించాడు. ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఘటనతో హుస్సేన్​ దంపతులు తల్లడిల్లిపోయారు. ఓ వెంచర్​ నిర్వాహకులు నిర్లక్ష్యంగా గుంత తీసి వదిలేయటంతోనే తమ కుమారుడు చనిపోయారని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి తల్లిదండ్రులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

ప్రముఖ వైద్యుడు కూటికుప్పల సూర్యారావుకు సతీ వియోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.