కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప, కాకినాడలోని పలు గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా.. అరుణ పతాకావిష్కరణలు జరిగాయి. రమణయ్యపేట గ్రామ పంచాయతీ కార్యాలయం, వలసపాకల సెంటర్, వాకలపూడి గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సీనియర్ వర్కర్స్, సీఐటీయూ నాయకులు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ప్రస్తుతం కరోనా సమయంలో కూడా సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, పెట్టుబడిదారుల లాభాలు విపరీతంగా పెరుగుతున్నాయని నాయుకులు విమర్శించారు. ఇదే విషయం అనేక సంస్థల అధ్యయనంలో తేలిందన్నారు. కరోనా సమయంలోనే కార్మిక చట్టాలను కార్పొరేట్ రంగాలకు అనుకూలంగా లేబర్కోడ్లను మార్చేశారని కార్మిక నాయకులు విమర్శించారు.
ఇదీ చదవండి:
కరోనాతో సచివాలయ కార్యదర్శి మృతి.. తరలింపునకూ రాని అంబులెన్స్!