- " class="align-text-top noRightClick twitterSection" data="">
- రాష్ట్రంలో కొత్తగా 8,110 కరోనా కేసులు, 67 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 8,110 కరోనా కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 99,057 కరోనా యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. కరోనా నుంచి మరో 12,981 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం !
బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా పయనిస్తుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - తిరుమలలో గదుల కేటాయింపు మరింత సులభతరం
తిరుమలలో గదుల కేటాయింపును తితిదే మరింత సులభతరం చేసింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం ఉదయం 8 గం.కు రిజిస్ట్రేషన్ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - గర్భిణికి తప్పని పాట్లు.. డోలీలో 4 కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్థులు
విశాఖ జిల్లా హుకుంపేట మండలం కిన్నెరలోవ గ్రామంలో ఓ గర్భిణి ప్రసవ వేదనతో తల్లడిల్లింది. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో డోలీ కట్టి 4 కిలోమీటర్ల మేర కొండ దిగువకు మోసుకొచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - ఆ జూలో మరో రెండు సింహాలకు కరోనా
తమిళనాడులోని అన్నా జూపార్క్‌లో మరో రెండు సింహాలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఐవీఆర్ఐ గురువారం వెల్లడించింది. ఇటీవల నాలుగు పులులు, మూడు సింహాలకు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - ఆగస్టు 2 నుంచి సివిల్స్ ఇంటర్వ్యూలు
ఆగస్టు 2 నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్ష-2020 ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల కాల్ లెటర్లను అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - ఆస్ట్రేలియాలో వర్ష బీభత్సం- లక్షల మందికి అవస్థలు
ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - Stock Market: సెన్సెక్స్ 359 ప్లస్- 15,700పైకి నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం సెషన్లో సెన్సెక్స్ (Sensex Today) 359 పాయింట్లు పెరిగి.. 52,300 మార్క్ దాటింది. నిఫ్టీ (Nifty Today) 102 పాయింట్లు బలపడి.. 15,700 పైన స్థిరపడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - చంకలో పాప.. అద్భుత క్యాచ్‌తో ఆహా!
అమెరికా.. కాలిఫోర్నియా సాన్డిగో నగరంలో పెట్కోపార్క్లో జరిగిన ఓ బేస్‌బాల్ టోర్నీలో ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ వీక్షకురాలు(తల్లి) చంకలో బిడ్డ ఉండగానే ఒంటిచేత్తో బంతిని క్యాచ్ పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - పుట్టినరోజు వేడుకల్లో బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు ఈరోజు. కరోనా దృష్ట్యా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిరాడంబరంగా జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.