ETV Bharat / city

Murder: స్నేహితుడిని నరికి చంపిన యువకుడు - తాపీ మేస్త్రి హత్య

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడ్ని పుట్టిన రోజు నాడే.. అతని స్నేహితుడు కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

దారుణ హత్య
దారుణ హత్య
author img

By

Published : May 2, 2022, 12:36 PM IST

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడ్ని పుట్టిన రోజు నాడే.. అతని స్నేహితుడు కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. స్థానిక విఘ్నేశ్వర థియేటర్‌ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భాస్కర్‌నగర్‌లో నివాసముంటున్న తలాటి శివ(28) తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో రాజీవ్‌ గృహకల్పలో నివాసం ఉన్న సమయంలో అతనికి నరాల మణికంఠతో స్నేహం ఏర్పడింది. వీరి మధ్య వివాదం రావడంతో అక్కడి నుంచి వచ్చి సోదరుడితో కలిసి భాస్కర్‌నగర్‌లో ఉంటున్నాడు. పుట్టినరోజు కావడంతో బిర్యానీ కొంటుండగా.. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న మణికంఠ వేటకత్తితో ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. దారుణానికి పాల్పడిన మణికంఠ నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

తలాటం శివ

ఇదీ చదవండి:

Rape Attempt: విజయవాడలో బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

Murder: ప్రియుడితో కలిసి భర్తను చంపి.. అనుమానం రాకుండా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.