చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి కాకినాడ పోర్ట్‌కి 3 లారీల్లో తరలిస్తున్న సుమారు 90 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
దొంగతనాలకు పాల్పడిన సరకు రవాణా చేస్తూ..
రేషన్ దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడి.. ఆ సరకును రవాణా చేస్తోన్న ఇద్దరు వ్యక్తులను అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని సరళాదేవినగర్కు చెందిన గంగాధర్, రిక్షానగర్కు చెందిన మహమ్మద్ భాష ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో రేషన్ దుకాణాలు, ప్రజాపంపిణీకి ఉపయోగించే గోడౌన్లలో దొంగతనాలకు పాల్పడే వారు. దొంగతనం చేసిన సరకును అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించేవారు. పక్కా సమాచారంతో వారిని సోమలదొడ్డి గ్రామ సమీపంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో పలుచోట్ల వర్షాలు..జలమయమైన రోడ్లు