ETV Bharat / city

కాకినాడలో మడ అడవులను పరిశీలించిన ఎన్​జీటీ బృందం - NGT team visits kakinda news

కాకినాడలో మడ అడవులు నరికివేసి లే అవుట్లు వేసిన భూముల్ని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్​జీటీ) బృందం పరిశీలించింది. ఈ భూముల్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడం వల్ల జరిగే అనర్థాలను తెదేపా, జనసేన నాయకులు ఎన్​జీటీ బృందానికి వివరించారు.

NGT
NGT
author img

By

Published : Dec 10, 2020, 4:50 PM IST

కాకినాడలో మడ అడవుల్లో ఎన్​జీటీ బృందం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దుమ్మలపేటలో మడ అడవులు నరికి వేసి పేదలకు ఇళ్ల స్థలాలకు లే అవుట్ వేసిన భూముల్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ బృందం గురువారం పరిశీలించింది. ఈ భూముల్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడం వల్ల జరిగే అనర్థాలను మాజీఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు ఎన్​జీటీ బృందానికి వివరించారు. కాకినాడకు రక్షణ కవచంలా ఉన్న మడ అడవులు నరికి వేయడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ఈ సమస్యపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన జనసేన నాయకుడు బొల్లిశెట్టి సత్యనారాయణ కూడా.. సమస్యపై బృందానికి వివరించారు. మరోవైపు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ స్థానిక మత్స్యకార సంఘాల నాయకులు అధికారులకు విన్నవించారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా ఎన్​జీటీ బృందం వెంట పర్యటించారు.

సముద్రానికి సమీపంలోని మడ అడవులు నరికి వేసి లేఅవుట్లు వేయడం తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ప్రస్తుతం చదును చేసి మెరక చేసిన భూముల్లో నుంచి నరికి వేసిన మడ చెట్ల మొదళ్లు చిగురించి పైకి తేలాయి.

ఇదీ చదవండి

కోసుకుపోతున్న రక్షణ కవచం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.