ETV Bharat / city

'వైకాపా వంద రోజుల పాలన వైఫల్యాలమయం' - వైకాపా వంద రోజుల పాలనపై జనసేన

వైకాపా వంద రోజుల పాలన వైఫల్యాలమయంగా మారిందని జనసేన పార్టీ ఆరోపించింది. ఇసుక విధానంలో స్పష్టత లేక..రాష్ట్ర నిర్మాణ రంగం కుదేలైందని అభిప్రాయపడింది. ప్రశాంత కోనసీమలోని రాజోలు నియోజకవర్గంలో 144 సెక్షన్​ ఉందని..ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్​ ఆవేదన వ్యక్తం చేశారు.

కాకినాడలో జనసేన సమావేశం న్యూస్​
author img

By

Published : Sep 15, 2019, 1:41 PM IST

కాకినాడలో జనసేన పార్టీ సమావేశం
వైకాపా వంద రోజుల పాలన ఘోరంగా వైఫల్యం చెందిందని..ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్​ ఆరోపించారు. శనివారం కాకినాడలో జరిగిన సమావేశంలో జనసేన నాయకులు కందుల దుర్గేశ్​, పంతం నానాజీ, రాజబాబు, పితాని బాలకృష్ణ ప్రభుత్వ తీరును విమర్శించారు.

నూతన ఇసుక విధానం అస్తవ్యస్తంగా ఉందని అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలోనూ స్పష్టత లేదని..అందుకే పెట్టుబడులు వెనక్కిపోతున్నాయన్నారు. గోదావరి వరదల సహాయక చర్యల్లో యంత్రాంగం విఫలమైందన్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్​పై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఉభయగోదావరి జిల్లాల్లో రాయలసీమ ఇసుక ముఠా జోక్యం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలులో 144 సెక్షన్​ అమలుపై ఆవేదన చెందారు.

ఇవీ చదవండి...రాపాక విడుదల.. ఎస్సై తీరుపై తీవ్ర ఆగ్రహం

Intro:slug: JK_AP_CDP_36_14_ANDANI_NEERU_BYTES_PKG_AP10039 op
contributor: arif, jmd
ఇటు నీరు ....అటు ఎడారి
anchor: గాలేరు-నగరి వరద కాలువ లక్షల ఎకరాలకు జీవనాధారం. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసినప్పుడు కాలువ ద్వారా గండికోట జలాశయానికి నీటిని మళ్లిస్తారు. కడప జిల్లాలో మైలవరం మండలం లోని పలు గ్రామాలను తాకుతూ ఈ కాలువ ప్రవహిస్తుంది . చెంతనే కాలువ ఉన్నా... మండలంలోని పలు చెరువులు ఎడారు లను తలపిస్తున్నాయి .ముఖ్యంగా 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువులో చుక్క నీరు లేదు. వరుస కరువులతో తీవ్రంగా నష్టపోయామని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాయిస్ ఓవర్: కడప జిల్లా మైలవరం మండలం లోని చెరువు పై ఆధారపడి.... తలమంచిపట్నం, నవాబుపేట గంగుల నారాయణ పల్లె ,సి కొత్తపల్లె ,చిన్న చిన్న కొమ్మేర్ల తదితర గ్రామాల రైతులు పంటలు పండించుకుంటున్నారు. వర్షాకాలంలో కొండకోనల్లో కురిసిన వాన ద్వారా ఈ చెరువు నిండేది. 2007లో గాలేరు-నగరి వరద కాలువ నిర్మాణం ఈ చెరువుకు శాపంగా మారింది .అప్పటి నుంచి నేటి వరకు ఈ చెరువు అనుసంధానంగా ఉన్న వంకలు వాగులు నుంచి నీరు చేరడం లేదు. చెరువు కింద ఉన్న సుమారు ఐదు వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.
బైట్ 1 రామలింగారెడ్డి రైతు మైలవరం మండలం.
2 రామచంద్రుడు రైతు మైలవరం మండలం
వాయిస్ ఓవర్:
పిన్నయ్య చెరువుపక్క నుంచే వరద కాలువ పోతోంది. కాలువకు స్లూయిస్ ఏర్పాటు చేస్తే చెరువు నిండుతుదని రైతులు సూచిస్తున్నారు .చెరువు ఒకసారి నిండితే ఏడు గ్రామ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందుతుంది. కాలువలో ప్రవహిస్తున్న నీటి ని నమ్ముకుని వేల రూపాయలు ఖర్చు చేసి పంటలు వేశాం... వారం పది రోజుల తర్వాత గాలేరు నగరి నీరు ఆగిపోతే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
బైట్ 3 పుల్లయ్య రైతు మైలవరం మండలం
4 వెంకట కృష్ణయ్య రైతు మైలవరం మండలం
ఎండ్ వాయిస్ ఓవర్: గాలేరు-నగరి కాలువ...చెంతనే ఉన్నా చెరువులు ఎడారుల్లా మారాయని రైతులు వాపోతున్నారు. కాలువ నుంచి ఎత్తిపోతలు, లేదా స్లూయిస్ ఏర్పాటుచేసి మండలంలోని పలు చెరువులు నింపి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Body:JK_AP_CDP_36_14_ANDANI_NEERU_BYTES_PKG_AP10039

Conclusion:JK_AP_CDP_36_14_ANDANI_NEERU_BYTES_PKG_AP10039
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.