తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆలిండియా బ్యాక్వార్డ్ క్లాసెస్ ఫెడరేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా జాతీయస్థాయిలో ఉద్యమించాలని ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 85 శాతం మంది ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలను ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు.
జస్టిస్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో అంబేడ్కర్, జ్యోతిరావుపూలే ఆశయాలకు అనుగుణంగా ఈ సంఘం ఏర్పడిందని తెలిపారు. అన్ని కులాలను ఏకం చేస్తూ గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటు ద్వారా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్‌కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు నివేశనా స్థలాల కేటాయింపు