తూర్పు గోదావరి జిల్లాలో పొగమంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. తెల్లవారుజామున కురిసే మంచు చూపరులను ఆకర్షిస్తున్నాయి. శీతాకాలం ప్రారంభం నుంచి ఎన్నడూ లేని విధంగా గురువారం తెల్లవారుజామున నుంచి విపరీతంగా మంచు కురుస్తోంది. రహదారులన్నీ మంచుతెరతో కమ్మేశాయి. పొద్దు పొద్దున్నే పక్షుల రాగాలు... పువ్వులపై కురుస్తున్న బిందువులు ఆకట్టుకుంటున్నాయి. కొబ్బరి చెట్ల పై కురుస్తున్న పొగమంచు అందాలను కోనసీమ వాసులు తిలకిస్తున్నారు.
ఇదీ చదవండి: శ్వేతవర్ణంలో కశ్మీర్ లోయ- పర్యటకుల సందడి