ETV Bharat / city

కూతురి కోసం దొంగగా మారిన.. ఓ తండ్రి కథ! - కూతురి వైద్యం కోసం తండ్రి దొంగతనాలు

ఎటువంటి వ్యసనాలు లేవు... అల్లరి చిల్లరగా తిరిగేవ్యక్తీ కాదు.. తాపీ పనిచేసేవాడు... కుమార్తె వైద్యం కోసం దొంగగా మారాడు. ఏడు జిల్లాల పరిధిలో 14 నెలల్లో 107 ద్విచక్ర వాహనాలు చోరీచేశాడు. కుటుంబ పరిస్థితి చూసి జాలిపడినా.. విద్యుక్త ధర్మం ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్థితి పోలీసులది.

thief
thief
author img

By

Published : Jun 28, 2022, 7:24 PM IST

ఆ తండ్రి ఇద్దరు కుమార్తెలు. వారంటే అతనికి ప్రాణం. వారిలో ఓ కూతురికి చెవిటి, మూగ. ఆ చిన్నారికి వైద్యం కోసం అన్ని ఆస్పత్రులకు తిరిగాడు. ఉన్నదంతా ఖర్చు చేశాడు. అయినప్పటికి ధైర్యం కొల్పోకుండా.. అన్ని ప్రయత్నాలు చేశాడు. అప్పుడే అతనికి టాలీవుడ్​లో విజయవంతమైన ఓ చిత్రం గుర్తొచ్చింది. ఆ సినిమాలో చిన్ని పిల్లల వైద్య ఖర్చుల కోసం.. హీరో బడాబాబుల ఇళ్లలో చోరీ చేయటం మొదలు పెడతాడు. అలా వచ్చిన డబ్బుతో పిల్లలకు వైద్యం, అనాథల కోసం విరాళాలు ఇస్తాడు. కట్ చేస్తే ఆ హీరో ఆదర్శంగా తీసుకన్న ఆ తండ్రి.. తన కూతురు వైద్యం కోసం చోరీలు మొదలు పెట్టాడు. ఏకంగా 14 నెలల్లో 107 ద్విచక్ర వాహనాలు చోరీచేశాడు. కట్ చేస్తే ఆ సినిమాలో దొంగ ఎవరో తెలిసినా పోలీసులు ఏం చేయలేకపోయారు. కానీ నిజ జీవితంలో ఇది సాధ్యమా..!

కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన నడిగట్ల కృష్ణ.. జగ్గంపేటలో ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. అయిదేళ్ల చిన్నకుమార్తెకు చెవిటి, మూగ. ఈమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆసుపత్రులకు తీసుకెళ్లి చూపించేవాడు. అమ్మాయి ఆరోగ్య ఖర్చుల కోసం ద్విచక్ర వాహన చోరీలు మొదలుపెట్టాడు. గత ఏడాది ఏప్రిల్‌లో కడియంలో ఓ బైక్‌ చోరీచేశాడు. ఇప్పటివరకు తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో 107 బైక్‌లను తస్కరించాడు. వీటిని జగ్గంపేట మండలం గోవిందపురానికి చెందిన మంగిన వీరబాబుకు విక్రయించేవాడు. చివరకు బైకుల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు.

దొంగతనాలకు కారణం తెలుసుకున్న పోలీసులు.. అతని కుటుంబ పరిస్థితి చూసి జాలిపడినా.. చివరకు విద్యుక్త ధర్మం ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో చేసేదేమి లేక.. నిందితులను కోర్టులో హాజరుపర్చామని ఎస్పీ చెప్పారు. వాహనాల విలువ రూ.23 లక్షల వరకు ఉంటుందన్నారు. సీఐ బి.సూర్యఅప్పారావు, ఎస్సై టి.రఘునాథరావు, ఏఎస్సైలు నూకరాజు, సుబ్బారావు, కానిస్టేబుల్‌, హోంగార్డులను అభినందించి రివార్డులు అందజేశారు. ఏఎస్పీ అడ్మిన్‌ పి.శ్రీనివాస్‌, డీఎస్పీ బి.అప్పారావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.