తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి గణేష్ బాబు అధ్యక్షతన మండలంలోని 78 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. ప్రధానోపాధ్యాయులందరూ ఈ సమావేశానికి హాజరై తమ తమ పాఠశాలలో పాఠశాలల్లో పాటిస్తున్న నిబంధనలు, కరోనా నియంత్రణ సూచనలను అధికారులకు వివరించారు.
ఈ సమయంలో మండల విద్యాశాఖాధికారి గణేష్ బాబు క్రైస్తవ మతానికి సంబంధించిన పాట పాడి కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని తెలపడంతో అక్కడ ఉన్నవారందరూ నిర్ఘాంతపోయారు. గణేష్ బాబు చెప్పినట్లు క్రిస్టియన్ పాట పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక మతానికి సంబంధించిన పాటలు పాడడంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై మండల అభివృద్ధి అధికారి పాఠంశెట్టి నారాయణమూర్తిని వివరణ కోరగా.. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీచదవండి.