లాక్‌డౌన్‌లో తరగతి గదులకు దూరంగా ఉన్న విద్యార్థులు.. తమ ఇష్టాలకు, ఆసక్తికర అంశాలకు పదునుపెట్టారు. నేరుగా గురువుల వద్ద సాధన చేసే కళలు, సాంస్కృతిక అంశాలనూ ఆన్‌లైన్‌లోనే నేర్చుకుంటున్నారు. కాకినాడలో వివిధ రంగాలకు చెందిన గురువులు ఆన్‌లైన్‌లో బోధించేందుకు ముందుకురాగా.. విద్యార్థులూ అంతే ఆసక్తిగా క్రమం తప్పకుండా సాధన చేసి యోగ, భగవద్గీత పారాయణం, వేమన పద్యాలు నేర్చుకున్నారు.
భానుగుడి కూడలికి చెందిన శోభ.. చిన్నప్పుడు నేర్చుకున్న భగవద్గీత, వేమన పద్యాలను.. ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే ఉచితంగా బోధించారు. పదిరోజులకు ఒక బ్యాచ్ చొప్పున తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నేర్పుతున్నారు.
జగన్నాథపురం మల్లాడి సత్యలింగం నాయకర్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం బోధిస్తున్న చిట్టిబాబు.. ఆన్‌లైన్‌లో ఉచితంగా యోగ శిక్షణ ఇస్తున్నారు. గతంలో జాతీయస్థాయిలో పలు ప్రదర్శనలు ఇచ్చిన ఆయన.. కాకినాడ వాసులకు స్కైప్, జూమ్, గూగూల్ మేట్ ద్వారా 200 మందికిపైగా యోగసనాలు నేర్పించారు.
యోగ, భగవద్గీత కాకుండా.. కరాటే, నృత్యం, ఇతర కళారూపాలనూ పలువురు గురువులు ఆన్‌లైన్‌లో ఉచితంగా బోధిస్తున్నారు.
ఇదీ చదవండి: