ETV Bharat / city

మద్యం అమ్మకాలు నిలిపివేయాలని గాంధేయ మార్గంలో నిరసనలు - ఏపీ మద్యం నియంత్రణ పోరాట సమితి తాజా వార్తలు

బహిరంగ మద్యం విక్రయాలను నిషేధించాలని కాకినాడలో ఏపీ మద్యం నియంత్రణ పోరాట సమితి నిరాహార దీక్ష చేపట్టింది.

ap liquor ban association people went on hunger strike in kakinada
ఏపీ మద్యం నియంత్రణ పోరాట సమితి
author img

By

Published : Jul 25, 2020, 11:45 PM IST

కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న బహిరంగ మద్యం విక్రయాలను నిషేధించాలని ఏపీ మద్యం నియంత్రణ పోరాట సమితి నిరాహార దీక్ష చేపట్టింది. కాకినాడలోని సూర్యారావు పేట జవహర్ వీధిలోని వివేక్ భవన్​లో.. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, ప్రధాన కార్యదర్శి హాసన్ షరీఫ్, కన్వీనర్ కాశీ బాలయ్య దీక్షలో పాల్లొన్నారు. నగర కన్వీనర్ కోయ్యా జ్యోతి దీక్షలను ప్రారంభించి కలెక్టరేట్​లో వినతి పత్రాన్ని అందజేశారు.

భగవద్గీత, ఖురాన్, బైబిల్ గ్రంథాలను చేతబట్టి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించారు. కరోనా విపత్తులో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సంఘం పెద్దలు కోరారు. మద్యం అమ్మకాలను ఆపేవరకు తాము గాంధేయ మార్గంలో ప్రజా నిరసనలు కొనసాగిస్తామని దూసర్లపూడి రమణరాజు ప్రకటించారు. తుదిగా న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

లాక్​డౌన్​పై అవగాహన కల్పిస్తూ... పోలీస్ వాహనాలతో ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.