ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. లాల్ సింగ్ చద్దా షూటింగ్ నిమిత్తం రెండు రోజుల పాటు జిల్లాలో ఆయనపై పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. శుక్రవారం అమలాపురంలో, శనివారం కాకినాడ బీచ్‌లో చిత్రీకరణ జరగనుంది. ఆయన కాకినాడలోని ఓ హోటల్లో బస చేశారు.
కొవిడ్ నేపథ్యంలో ఆమిర్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించలేదు. ఆయన బస చేసిన హోటల్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు.
ఇదీ చదవండి: ఔరా..! అల్లుడు తెచ్చిన శ్రావణం సారె అదుర్స్