ETV Bharat / city

కాకినాడలో దుబాయ్​ నుంచి వచ్చిన మహిళ మృతి - కాకినాడలో కరోనా కేసు

ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఆమె మెదడువాపు వల్లే చనిపోయిందని వైద్యులు తెలిపారు. అయితే ముందు జాగ్రత్తగా ఆమె నమూనాలను ప్రయోగశాలకు పంపారు.

kakinada ggh
kakinada ggh
author img

By

Published : Mar 16, 2020, 9:31 PM IST

ఈటీవీ భారత్​తో ఆసుపత్రి సూపరింటెండెంట్‌

తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో 38 ఏళ్ల మహిళ మెదడువాపు వ్యాధి లక్షణాలతో నిన్నరాత్రి మృతి చెందారు. ఈమె మెనింగోఎన్‌ సెపరేటిస్‌ లక్షణాలతో మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించామని... ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.ఎం.రాఘవేంద్రరావు చెప్పారు.

దుబాయ్‌ నుంచి ఈనెల 11న హైదరాబాద్​కు చేరుకున్న ఈమె 13న జిల్లాకు వచ్చారు. అస్వస్థతకు గురైన ఈమెను ఈనెల 15న కాకినాడలో జీజీహెచ్​లోని కరోనా ఐసొలేటెడ్‌ వార్డులో చేర్చారు. ఈమె నుంచి రక్తం, ముక్కు, గొంతు ద్రవాల నమూనాలను పరీక్షల నిమిత్తం తిరుపతికి పంపారు. ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈమె మృతిపై స్థానికంగా భిన్న స్వరాలు వినిపిస్తున్నా.. ఫలితాలు వచ్చాకే స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

కాకినాడ జీజీహెచ్​లో విదేశాల నుంచి వచ్చిన ఆరుగురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరి నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ 991 మంది విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కాల్‌సెంటర్‌ను, డీఎంహెచ్​వో కార్యాలయంలో కరోనా కంట్రోల్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్​లో సత్వర స్పందన బృందాన్ని సిద్దం చేసి అనుమానిత కేసులను ఐసోలేషన్‌ వార్డులో చేర్పిస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్​: వైద్యులు తరచూ వస్తున్నారని పాడేరులో యువకుడు పరార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.