కాకినాడలో ఓ మహిళా వాలంటీర్‌పై స్థానిక వైకాపా నాయకుడు దాడికి తెగబడ్డాడు. శాంతినగర్‌లో నివాసం ఉంటున్న 7వ వార్డు వాలంటీరు శ్రీలక్ష్మి ఇంటిపై మంగళవారం ఉదయం వైకాపా నాయకులు దాడి చేశారు. వాలంటీర్ శ్రీలక్ష్మి... ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు. తాము గతంలో తెలుగుదేశం సానుభూతి పరులుగా పని చేశామని..అందువల్లే వైకాపా నాయకుడు బళ్ల సూర్యనారాయణ ప్రోద్బలంతోనే దాడి చేశారని వాలంటీర్ శ్రీలక్ష్మి చెబుతున్నారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వాలంటీర్ శ్రీలక్ష్మి వేడుకొంటున్నారు.
ఇదీ చదవండి: