ఈ మధ్యనే.. దిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతడు ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రార్థనల్లో పాల్గొన్నాడు. జిల్లాలోని వాకపల్లి, శరభవరం, ఉత్తరకంచి, ప్రత్తిపాడు గ్రామాలకు చెందిన 40 మంది ముస్లింలు ఈ ప్రార్థనలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో క్వారంటైన్ నిమిత్తం నలభై మందిని కాకినాడ జేఎన్టీయూకు అధికారులు తరలించారు. అతను ప్రత్యక్షంగా కలిసిన వ్యక్తిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వారిని క్వారంటైన్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణాలో కరోనా మృతులంతా అక్కడి నుంచే వచ్చారు!