మూడు రాజధానులకు మద్దతుగా కడపలో వైకాపా శ్రేణులు రిలే నిరాహార దీక్ష చేపట్టాయి. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి వైకాపా కార్యకర్తలు దీక్ష ప్రారంభించారు. రాష్ట్రం ప్రగతి పథంలోకి రావాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కడప మాజీ మేయర్ సురేష్‌బాబు అన్నారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసేందుకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సురేష్‌బాబు వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు సాధించుకునే వరకు దీక్షలు కొనసాగిస్తామని మాజీ మేయర్ తెలిపారు.
ఇదీ చదవండి: