కడప నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి మత్తు ఇంజక్షన్ వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ఓ యువతి కడపలోని మహిళా వసతి గృహంలో ఉంటూ ఓ నర్సింగ్ హోమ్ స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ బుడ్డాయిపల్లెలో ఓ గది అద్దెకు తీసుకొని మరో నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సోమవారం రాత్రి ఆ యువతి బుడ్డాయపల్లెలో ఉన్న అనిల్ కుమార్ గదికి వెళ్లింది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ యువతి మిద్దెపైకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: గుత్తి సబ్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ మృతి