ETV Bharat / city

Viveka Murder Case: 'వివేకాతో మా కుమారుడు సన్నిహితంగానే ఉండేవాడు.. కానీ..!' - kadapa jail

వైఎస్‌ వివేకా తమ ఇంటికి రెండుసార్లు వచ్చాడని కడప కేంద్ర కారాగారంలో రిమాండ్​ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్​ తండ్రి కృష్ణయ్య తెలిపారు. వివేకాతో తన కుమారుడు సన్నిహితంగా మెలిగింది నిజమేనని చెప్పారు. కానీ సునీల్ హత్య చేశాడు అన్నది అవాస్తవం అని కృష్ణయ్య స్పష్టం చేశారు.

సునీల్ యాదవ్​ తండ్రి కృష్ణయ్య
సునీల్ యాదవ్​ తండ్రి కృష్ణయ్య
author img

By

Published : Aug 9, 2021, 7:42 PM IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డితో తన కుమారుడు సునీల్ యాదవ్ సన్నిహితంగా మెలిగింది నిజమేనని సునీల్ తండ్రి కృష్ణయ్య తెలిపారు. వివేకా తమ ఇంటికి రెండు సార్లు వచ్చారన్న కృష్ణయ్య.. ఆయన్ను సునీల్‌ యాదవ్‌ హత్య చేశాడన్నది మాత్రం అవాస్తవమేనని స్పష్టం చేశారు. రెండున్నర ఏళ్లుగా ఏమీ మాట్లాడని రంగయ్య ఇప్పుడే ఎందుకు నోరు విప్పాడని అనుమానం వ్యక్తం చేశారు. రంగయ్య ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తన కుమారుడి ప్రమేయం లేకపోయినా సీబీఐ అధికారులు కావాలనే కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్​ ఖైదీగా సునీల్ ఉన్నాడు.

'కావాలనే ఇరికించారు..'

రెండేళ్ల నుంచి పోలీసులు, సీబీఐ అధికారులు తమ కుటుంబాన్ని చిత్ర హింసలు పెడుతున్నారని సునీల్ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్​ను సీబీఐ అధికారులు తీవ్రంగా కొట్టినట్లు ఆరోపిస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపించారు. హత్య చేసినట్టు అంగీకరించాలని సునీల్ స్నేహితుడు ఒత్తిడి చేయటంతో గత్యంతరం లేక గోవా పారిపోయాడన్నారు. వైఎస్ కుటుంబం అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని.. కొందరు వ్యక్తులు కావాలనే తమ కుమారుడిని ఇరికిస్తున్నారని సావిత్రి వాపోయారు. దస్తగిరి, ఉమా శంకర్ ద్వారానే సునీల్​కు వివేకానందరెడ్డి పరిచయం అయ్యారు కానీ.. హత్య కేసుతో సంబంధం లేదన్నారు. వివేకాను హత్య చేసిందెవరో సీబీఐకి తెలుసని సునీల్ భార్య లక్ష్మి ఆరోపించారు.

గోవాలో అరెస్టు..

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్​ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈనెల 2న గోవాలో సునీల్ యాదవ్​ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ ధృవీకరించింది. ఈ నెల 3న సునీల్​ను గోవా స్థానిక కోర్టులో హాజరు పరిచిన సీబీఐ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్​లోకి తీసుకున్నారు.

కొనసాగుతున్న విచారణ..

వివేకా హత్య కేసులో 64వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. సోమవారం పులివెందులకు చెందిన శిఖామణి, ఓబులేసు, రఘునాథరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, సంపత్, నీలయ్య, శ్రీనివాస్ రెడ్డి లను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

Viveka murder case: 64వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

Viveka Murder Case: 'వివేకా హత్య కేసులో నా కుమారుడిని కావాలనే ఇరికించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.