Road accident: కడప శివారులోని మద్దిమడుగు తాండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కడప నుంచి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు రామాపురం నుంచి కడప వైపు వెళ్తున్న ఆటోను మద్దిమడుగు తాండ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: