ETV Bharat / city

"జగన్​ సంస్కారహీనుడు.. ఇంతకన్నా నిదర్శనం కావాలా?" - కపడపో తులసిరెడ్డి పర్యటన

Tulasi reddy: దివంగత కొణిజేటి రోశయ్యకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోవడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు. జగన్​ సంస్కారహీనుడనడానికి ఇంతకంటే నిదర్శనం లేదని ధ్వజమెత్తారు.

Tulasi reddy
తులసిరెడ్డి
author img

By

Published : Mar 9, 2022, 12:36 PM IST

Tulasi reddy: కొణిజేటి రోశయ్యకు ఏపీ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోవడం, నివాళులు అర్పించకపోవడం చాలా దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. సీఎం జగన్​ సంస్కారహీనుడని, ఆ విషయం చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని మండిపడ్డారు.

అసెంబ్లీలో 15 సార్లు రాష్ట్ర బడ్జెట్​ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన గొప్ప ఆర్థికవేత్త రోశయ్యకు.. రాష్ట్ర అసెంబ్లీలో కనీసం సంతాప తీర్మానం పెట్టకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్​, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ ప్రజలకు క్షమాపణ చెప్పి.. సంతాప తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇదీ చదవండి: Varla letter to DGP: 'సంఘ విద్రోహశక్తుల నుంచి చంద్రబాబుకు ముప్పు ఉంది..' డీజీపీకి వర్ల రామయ్య లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.