అమ్మ ఒడి పథకం పేరు మార్చి... మమ్మీ ఒడి పథకమని పెడితే బాగుండేది అని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే ప్రతిపాదనపై మండిపడ్డారు. అమ్మ ఒడికి వివిధ సంక్షేమ పథకాల నుంచి నిధులను మళ్లించి ఆర్భాటంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తిపచేయటం న్యాయమేనా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: