ETV Bharat / city

కాళ్లు పట్టుకుంటేనే మా భూమి ఇస్తామంటున్నారు - మైదుకురు నియోజకర్గం వార్తలు

Encroached land తన ఎకరం భూమిని మైదుకూరు నియోజకవర్గం పుల్లారెడ్డిపేటకు చెందిన ముఖ్యమంత్రి జగన్‌ సమీప బంధువు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి ఆక్రమించారని కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్‌బాషా ఆరోపించారు. తనతో పాటు భార్య, పిల్లలూ రోజూ కాళ్లు పట్టుకుంటే ఆ భూమి తిరిగి ఇవ్వడంపై ఆలోచిస్తారని అప్పటి మైదుకూరు డీఎస్పీ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపాల్‌రెడ్డి నుంచి నా కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిాపారు. చావనైనా చస్తాం గానీ ఆయన కాళ్లు మాత్రం పట్టుకోనని పేర్కోన్నారు . అలా వచ్చే భూమి మాకొద్దు. న్యాయపరంగా పోరాటం చేస్తానని అక్బర్‌బాషా పేర్కొన్నారు.

The family is concerned
కాళ్లు పట్టుకుంటేనే మా భూమి ఇస్తామంటున్నారు
author img

By

Published : Aug 23, 2022, 10:53 AM IST

Concern about the land వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలోని తన ఎకరం భూమిని మైదుకూరు నియోజకవర్గం పుల్లారెడ్డిపేటకు చెందిన ముఖ్యమంత్రి జగన్‌ సమీప బంధువు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి ఆక్రమించారని కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్‌బాషా ఆరోపించారు. ‘నేను చావుకు తెగించా.....చంపేస్తారని తెలుసు... నన్ను ఒక్కరినే కాకుండా నా కుటుంబాన్ని చంపేయండి... అని ఆయన పేర్కొన్నారు. తిరుపాల్‌రెడ్డి అహం సంతృప్తి చెందే వరకు తనతో పాటు భార్య, పిల్లలూ రోజూ కాళ్లు పట్టుకుంటే ఆ భూమి తిరిగి ఇవ్వడంపై ఆలోచిస్తారని అప్పటి మైదుకూరు డీఎస్పీ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంతో కలిసి అక్బర్‌బాషా సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘కోర్టు నుంచి పర్మినెంట్‌ ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా సాగు చేయకుండా పోలీసులను పంపి అడ్డుకుంటున్నారు. జిల్లా ఎస్పీని కలిస్తే 145వ సెక్షన్‌ విధించినట్లు చెప్పారు. కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేకపోయింది. తిరుపాల్‌రెడ్డి నుంచి నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. చావనైనా చస్తాం గానీ ఆయన కాళ్లు మాత్రం పట్టుకునేది లేదు. అలా వచ్చే భూమి మాకొద్దు. న్యాయపరంగా పోరాటం చేస్తాను... అని ఆయన పేర్కొన్నారు. అధికారపార్టీ నేతల మోసానికి బలై అందరినీ దూరం చేసుకున్నానన్నారు. నాడు అండగా నిలిచేందుకు వచ్చిన మైనార్టీ సంఘాల నేతలపై పోలీసులు 307 సెక్షన్‌ కింద కేసులు పెట్టినా ఒక్క మాట మాట్లాడలేకపోయానని చెప్పారు. వారందరినీ క్షమాపణలను కోరుతున్నానని అక్బర్‌బాషా పేర్కొన్నారు. ఇప్పుడు అండగా నిలవాలని కోరారు.

జగన్‌ను దేవుడు అనడమే నా మొదటి తప్పు

‘నా భూమిని తిరుపాల్‌రెడ్డి ఆక్రమించారని గతేడాది సెప్టెంబరు 11వ తేదీన వీడియో పెట్టాను. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో కడప మేయర్‌ సురేశ్‌బాబు, ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌, తిరుపాల్‌రెడ్డి, అతని ఇద్దరు కుమారులు, అతని అల్లుడు కలిసి రూ.10 లక్షలు ఇస్తే ఆ భూమి ఇచ్చేలా నాకు అగ్రిమెంట్‌ రాసిచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు నాతో జగన్‌ దేవుడు అని చెప్పించారు. అలా చెప్పడమే నేను జీవితంలో చేసిన మొదటి తప్పు...’ అని అక్బర్‌బాషా పేర్కొన్నారు. ‘ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయర్‌ సురేశ్‌బాబును పలుమార్లు కలిశా. ముఖ్యమంత్రిని కలిసేందుకు మూడు సార్లు ప్రయత్నించినా అవకాశం కల్పించలేదు. సీఎం జగన్‌ ఒక్క మాట చెబితే మా భూమి మాకు వస్తుంది. తిరుపాల్‌రెడ్డి కబ్జాకు ప్రభుత్వ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారు. ఆయనకు రూ.2వేల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి? మైదుకూరు నియోజకవర్గంలో నాలాంటి వారు ఎందరో ఉన్నారు. ప్రభుత్వం విచారణ చేయిస్తే అన్నీ బయటకు వస్తాయి...’ అని అక్బర్‌బాషా పేర్కొన్నారు. ఇకపై చంద్రబాబు, పవన్‌, కేసీఆర్‌, ఓవైసీని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.