అటవీ ప్రాంతాల్లోని రహదారుల్లో అప్పుడప్పుడు మూగ జీవాలు రోడ్డు మీదకు వస్తుంటాయి. వాహన చోదకులు వాటిని గమనించక.. ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కడపజిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నల్లచెరువుపల్లె వద్ద రోడ్డు దాటుతున్న జింకను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరపునాయునిపల్లె మండలం పాలగిరి గ్రామానికి చెందిన సుధాకర్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే.. మృతి చెందాడు. జింక కూడా ప్రాణాలు విడిచింది. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు.
వాహనం ఢీకొని..
తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో ఓ ఎలుగుబంటి రోడ్డు పక్కన మృతి చెంది ఉండటం అటవీ అధికారులు గుర్తించారు. మృత్యువాత పడ్డ ఎలుగుబంటి కి అయిదు సంవత్సరాల వయసు ఉంటుందని, పోస్టుమార్టం చేసి దహనం చేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే భారీ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు
ఇదీ చదవండీ.. Devineni: దేవినేని ఉమ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా