ETV Bharat / city

పరీక్ష రాయడానికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి..ఆపై.... - Rape on minor at Kadapa

Rape on minor: పరీక్ష రాసేందుకు పొరుగూరు వచ్చిన ఓ మైనర్ కు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చిన ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన కడపలో చోటు చేసుకుంది.

Rape on minor
Rape on minor
author img

By

Published : May 31, 2022, 1:48 PM IST

Rape on minor: వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలానికి చెందిన 17ఏళ్ల బాలిక కడపలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో స్టాఫ్ నర్స్ కోర్సు చదువుతోంది. నాలుగు రోజుల కిందట పరీక్ష రాసేందుకు కడపకు వచ్చింది. బాలిక కదలికలను గమనించిన పుల్లూరు మండలానికి చెందిన శివ కృష్ణ అనే వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి రాయచోటికి తీసుకువెళ్లాడు.పరీక్ష కోసం వెళ్లిన తమ కుమార్తె మూడు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి బారి నుంచి తప్పించుకు వచ్చిన బాలిక సోమవారం కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. శివకృష్ణ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు...పోలీసులు అతనిపై ఫోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.