ETV Bharat / city

'ముస్లిం నేతపై పెట్టిన పెట్టిన కేసును తక్షణమే ఎత్తివేయాలి' - kadapa latest news

కడపలో సీపీఐ నేతలు, ముస్లిం మతపెద్దలు ఆందోళన నిర్వహించారు. దువ్వూరు మండలంలో అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ముస్లిం నేషనల్ మానవ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫారుక్ షిబ్లీపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడపలో ముస్లిం నేతల ఆందోళన
కడపలో ముస్లిం నేతల ఆందోళన
author img

By

Published : Sep 12, 2021, 7:11 PM IST

కడప జిల్లా దువ్వూరు మండలంలో అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ముస్లిం నేషనల్ మానవ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫారుక్ షిబ్లీపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట అఖిలపక్ష పార్టీలు, ముస్లిం మత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతో బాధ్యత కలిగిన సీఐ కొండారెడ్డి అధికార పార్టీ కార్యకర్తలా మారి అక్బర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం తగదని అన్నారు. పోలీసుల అవలంబిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు.

ఇదీచదవండి.

VMRDA: వీఎంర్‌డీఏ బృహత్తర ప్రణాళిక-2041..వసూళ్లు మొదలుపెట్టిన మధ్యవర్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.