ETV Bharat / city

'వేధిస్తున్నారు.. కొవిడ్ చికిత్స అందించలేం'

కడప నగరంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇకపై కొవిడ్ రోగులకు వైద్యం అందిచబోమని ప్రకటించాయి. డాక్టర్లపై వేధింపులకు నిరసనగా ఇలా చేస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

covid services stopped
అక్కడి ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలు నిలిపివేత
author img

By

Published : Apr 29, 2021, 10:32 PM IST

కడపలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇకపై కొవిడ్ చికిత్స అందించబోమని వాటి యాజమాన్యాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. రెండు రోజుల కిందట విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించి... రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న రెండు ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఈ మేరకు ప్రైవేటు వైద్యులు ఏకమై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని.. ఇక నుంచి తమ ఆస్పత్రుల్లో కొవిడ్ వైద్యం చేయబోమంటూ తీర్మానం చేశారు. ఇలా చేయడం పట్ల కొంతమంది నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించారు.

ఇవీ చదవండి:

'భారత్​కు 5 లక్షల ఐసీయూ పడకలు అవసరం'

రాజంపేటలో సాయంత్రం 6గంటల వరకే దుకాణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.