కరోనా వ్యాప్తి నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలను ముస్లింలు ఇళ్లలోనే చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కోరారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో కరోనా వైరస్‌పై ఆయన టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. నగరంలో వైరస్ కట్టడికి ఇప్పటివరకు అధికారులు తీసుకున్న చర్యలపై చర్చించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. నగరంలో అలంఖాన్ పల్లె, సాయిపేట, పెద్దదర్గా, సరోజినగర్ ప్రాంతాలను రెడ్జోన్లుగా గుర్తించామని వెల్లడించారు. ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటివరకు నగరంలో వెయ్యి వరకు అనుమానితుల నమూనాలు సేకరించారని తెలిపారు. కడపలో కూరగాయల మార్కెట్లను వికేంద్రీకరణ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి అదుపులో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు పండించే పండ్లను కొనుగోలు చేసి... కడప నగరంలోని ప్రజలకు ఉచితంగా అందిస్తామని అంజద్ బాషా చెప్పారు.
ఇదీ చదవండి