ETV Bharat / city

'అదృశ్యమైన తెలుగువైద్యుల ఆచూకీ లభ్యం' - తెలుగువైద్యుల ఆచూకీ లభ్యం

దిల్లీలో గత నెల 25న అదృశ్యమైన ఇద్దరు తెలుగు వైద్యుల ఆచూకీ లభ్యమైంది. వైద్యులు దిలీప్ సత్య, హిమబిందు సిక్కింలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హిమబిందు భర్త శ్రీధర్ ఫిర్యాదుతో దిల్లీ పోలీసుల ముమ్మరంగా గాలించారు. దిలీప్‌సత్య సామాజిక మాధ్యమ ఖాతా ఉపయోగించడం వల్ల అతని ఆచూకీ లభ్యమైంది.

missing Telugu doctors founded by Delhi police

author img

By

Published : Jan 2, 2020, 12:41 PM IST

తెలుగు వైద్యుల ఆచూకీ తెలిసింది..!

దిల్లీలో గత నెల 25న అదృశ్యమైన ఇద్దరు తెలుగు వైద్యుల ఆచూకీ దొరికింది. వైద్యులు దిలీప్సత్య, హిమబిందు సిక్కింలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హిమబిందు భర్త శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దిల్లీ పోలీసులు... వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇద్దరి సామాజిక మాధ్యమాల ఖాతాలపై నిఘా ఉంచారు. దిలీప్సత్య తన సోషల్ మీడియా ఖాతాను ఉపయోగించడం వల్ల సాంకేతిక నిఘా ద్వారా వారి జాడను తెలుసుకున్నారు. వీరిద్దరూ సిక్కిం ఎందుకు వెళ్లారు... వీరి అదృశ్యం వెనుక కారణాలపై ఇద్దరినీ దిల్లీ తీసుకొచ్చి విచారిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన హిమబిందు, అనంతపురం జిల్లాకు చెందిన దిలీప్సత్య అదృశ్యమైనట్లు... డిసెంబరు 25న దిల్లీలోని హాజ్ ఖాస్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. హిమబిందు భర్త శ్రీధర్, దిలీప్ భార్య... సహా కుటుంబ సభ్యులకు వీరి ఆచూకీపై సమాచారాన్ని పోలీసులు అందించారు.

ఇవీ చదవండి:

ఒక్క పెయిడ్ ఆర్టిస్టు ఉన్నట్టు నిరూపించినా.. ఉద్యమం ఆపేస్తాం

Intro:బొకే బదులు బుక్స్ వాయిస్ ఓవర్ స్టోరీ ఫోటోలు

ap_vja_42a_01_bokaybadhulu_books_vo_ap10044

Body:బొకే బదులు బుక్స్ వాయిస్ ఓవర్ స్టోరీ ఫోటోలు

Conclusion:బొకే బదులు బుక్స్ వాయిస్ ఓవర్ స్టోరీ ఫోటోలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.