పెళ్లి అయి నెల రోజులు కాకుండానే అత్తింటి వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్లో జరిగింది. కడపకు చెందిన ఝాన్సీకి రాజంపేట బోయినపల్లికి చెందిన రాధాకృష్ణకు ఆగస్టు 15న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కట్నకానుకల కింద 15 లక్షలు ఇచ్చారు. రాధాకృష్ణ బెంగళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పెళ్లి అయిన రెండో రోజు నుంచి అధిక కట్నం కావాలంటూ వేధింపులకు గురి చేస్తూ ఉండేవారు.
70 లక్షలు ఇస్తేనే కాపురం..
ఈ క్రమంలో డబ్బుతోనే తిరిగి రావాలంటూ.. ఈనెల 2వ తేదీ అమ్మాయిని పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయారు. అందరూ కలిసి రెండు రోజుల కిందట రాజంపేటకు వెళ్లి పెద్దల సమక్షంలో పంచాయతీ చేశారు. తనకు 70 లక్షలు డబ్బులు కావాలని లేదంటే కాపురానికి తీసుకెళ్లనని.. రాధాకృష్ణ చెప్పాడు. తన వల్లే కుటుంబ సభ్యులు నవ్వులపాలు అవుతున్నారని ఉద్దేశంతో ఝాన్సీ ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. చిన్న చౌక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. పకడ్బందీగా సాగని జ్వరాల సర్వే.. అంతంత మాత్రంగానే దోమల నివారణ..