తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో అమలు చేయనున్న పౌర హక్కుల సేవా పత్ర చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ అమలు చేయాలని లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ విజ్ఞప్తి చేశారు. వాటివల్ల అధికారుల్లో జవాబుదారీ తనం పెరగడమే కాకుండా... గడువులోగా ప్రజలకు పని చేయలేకపోతే అధికారులే తిరిగి జరిమానా చెల్లించే విధంగా చట్టం ఉందని కడపలో వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పాలన అందించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలను అభినందిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వంటి కార్యక్రమాలు స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. శనగ రైతులను ఆదుకుని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు ఉత్పత్తులు పెంచితే లాభం ఉంటుందనే నమ్మకాన్ని వారిలో కల్పించాలని ఆయన సూచించారు. దేశంలో 8 కోట్ల టన్నుల నూనె మూలుగుతున్నా... రైతులు ఇంకా అదే సాగు చేస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి :