కడప జిల్లా రాజంపేటకు చెందిన నారాయణ కువైట్‌లో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న ఇథియోపియా దేశానికి చెందిన సెటయే అనే మహిళతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ పరిచయంతో 2015లో ఆమెను నారాయణ రాజంపేటకు తీసుకొచ్చాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెను వివాహం చేసుకోలేదు. ఆమెను ఇక్కడే ఉంచి జీవనోపాధి కోసమని మళ్లీ కువైట్ వెళ్లాడు. ఆమెకు డబ్బు పంపించేవాడు. ఈ క్రమంలో దురదుష్టవశాత్తు ఏడాది క్రితం నారాయణ గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఇథియోపియా మహిళ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. స్థానికులు.. ఆమె దీన స్థితిని కడప జిల్లా పోలీస్ అధికారి అన్బురాజన్‌కు వివరించారు. ఆయన వెంటనే స్పందిస్తూ.. ఇథియోపియా ఎంబసీ అధికారులతో మాట్లాడి వీసా తెప్పించారు. ఆమెను ఇథియోపియా పంపేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులను బందోబస్తుగా పంపించి ఇవాళ ముంబై నుంచి ఆమెను విమానంలో స్వస్థలానికి పంపించారు. ఎస్పీకి ఆ మహిళ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ప్రేమ పెళ్లి.. సడెన్‌గా అమ్మాయి తల్లిదండ్రుల ఎంట్రీ.. ఆ తర్వాత..!