కడప నగరంలో ఈనెల 24వ తేదీన రెండు ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసులను పోలీసులు 48 గంటల్లోనే చేధించారు. చెమ్ముమియాపేటలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ ఈనెల 24వ తేదీ వారి బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ రోజు రాత్రి వేళ.. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించి.. అదే అదునుగా భావించిన దొంగ ఆమె ఇంటికి వెళ్లి దొంగతనం చేశాడు. 50 గ్రాముల బంగారం చోరీ చేశాడు. కేసులో నిందితుడు వినయ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
మరో ఘటనలో..
రిమ్స్ పరిధిలోని ఓ ఇంటివద్ద ఉంచిన ట్రాక్టర్, ట్రాలీని నరసింహా అనే దొంగ ఎత్తుకెళ్లాడు. ఈ కేసును కూడా పోలీసులు 48 గంటల్లో చేధించారు. రెండు కేసుల్లో 15 లక్షల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడ్డాయని తెలిపారు.
ఇదీ చదవండి: