ETV Bharat / city

రెండు వేర్వేరు కేసుల్లో రూ. 7.40 లక్షలు స్వాధీనం - kadapa dsp suryanarayana latest news

రెండు వేర్వేరు కేసుల్లో ఘరానా మోసగాళ్లను కడప పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి నగదును స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు.

kadapa police arrest theives and money were recovered
ముగ్గురు మోసగాళ్లను అరెస్ట్​ చేసిన కడపపోలీసులు
author img

By

Published : Oct 9, 2020, 10:18 AM IST

రెండు వేర్వేరు కేసుల్లో ముగ్గురు ఘరానా మోసగాళ్లను కడప పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 7 లక్షల 40 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన రవిరెడ్డికి వ్యాపార నిమిత్తం రుణం అవసరం కాగా.. తన స్నేహితులైన అనిల్ కుమార్, శ్రీనివాసులును సంప్రదించారు. వారు కడపకు చెందిన ఆవుల ప్రభాకర్​ను రుణం కావాలని అడగగా... తనకు కమిషన్​ ఇస్తే రుణం ఇప్పిస్తానంటూ చెప్పాడు. అందుకు సమ్మతించిన ఇద్దరు కమిషన్​ ఇచ్చేందుకు రూ. లక్ష నగదు తీసుకుని కడప గాంధీ నగర్​ స్కూల్​ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆవుల ప్రభాకర్​, సాహెబ్​, దస్తగిరి... అనిల్​ కుమార్​, శ్రీనివాసులు వద్ద నుంచి డబ్బులు తీసుకుని నకిలీ నోట్లు అందజేశారు. అనిల్​, శ్రీనివాసులు ఇంటికి వెళ్లి చూడగా అందులో డబ్బులు లేవు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ముగ్గురిని గురువారం అరెస్ట్​ చేశారు. మరో కేసులో రూ. 3.56 లక్షల నగదును స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి :

దారి దోపిడీ దొంగలు అరెస్ట్ : డీఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.