ETV Bharat / city

వర్గపోరుల వైరిసీమలో ఎవరిది గెలుపు ధీమా..?

కడప... రాయలసీమ రాజకీయాల అడ్డా... ప్రతిపక్ష నేత సొంత జిల్లా... కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తుడుచుకుపోయిన  తెదేపా.. ఈసారి  జెండా పాతేయాలని తహతహలాడుతోంది. ఎన్నికలకు ముందర జరిగిన అనూహ్య సంఘటనలుు.. మార్పులు... చేర్పులు  జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. జతకడుతున్న రాజకీయాలు.. కడప గడపలో జగన్ ను నిలువరించగలవా..?

author img

By

Published : Apr 8, 2019, 6:03 AM IST

Updated : Apr 8, 2019, 12:00 PM IST

కడప గడపలో
వర్గపోరుల వైరిసీమలో ఎవరిది గెలుపుధీమా..?

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తున్న హాట్ ప్రాంతం కడప. అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా చిన్న జిల్లానే కానీ దాని ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సహా.. రాష్ట్రంలోని ప్రముఖ నేతలెందరినో అందించింది. ఇప్పటికీ జిల్లాలో వైఎస్ కుటుంబం హవా కొనసాగుతోంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్​ను దెబ్బతీయడానికి తెదేపా ఈసారి కడపపై గట్టిగానే గురిపెట్టింది. కిందటిసారి ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు వైకాపా 9 స్థానాల్లో తిరుగులేని విజయం సాధించింది. తెదేపాకు కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం జిల్లాపై టీడీపీ ముందునుంచే దృష్టిసారించింది. ఆదినారాయణరెడ్డి ని పార్టీలోకి తీసుకోవడంతో పాటు.. రామసుబ్బారెడ్డి- ఆదినారాయణరెడ్డిల మధ్య వైరాన్ని చాకచక్యంగా పరిష్కరించటం జిల్లా రాజకీయంలో కీలకంగా మారింది. కృష్ణా జలాలను జిల్లాకు అందించి ప్రజలకూ దగ్గరైంది. మరి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

జతకట్టిన జమ్మలమడగు
వైకాపా నుంచి జమ్మలమడుగు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెదేపాలోకి వచ్చి మంత్రి అయ్యారు. బలమైన నేత ఇటు రావడంతో టీడీపీ బలం పుంజుకుంది. రామసుబ్బారెడ్డి-ఆదినారాయణ రెడ్డి మధ్య వివాదాన్నీ చాకచక్యంగా పరిష్కరించింది. రెండు వర్గాలు కలిసిపోవడంతో విజయం తమదే అని తెదేపా ధీమాగా ఉంది. వైకాపా సుధీర్​రెడ్డి అనే కొత్త వ్యక్తిని అభ్యర్థిగా నిలిపింది. ఆయనింకా ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేకపోయారు.
పులివెందుల పరిస్థితి
వైఎస్ కుటుంబ కోట పులివెందులను ఢీ కొట్టాలని ఈసారి తెదేపా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రతిసారీ వైఎస్ కుటుంబంపై పోటీ చేస్తున్న సతీష్ రెడ్డిని.. ఎమ్మెల్సీ.. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ను చేసి తెదేపా రాజకీయంగా గుర్తింపు తెచ్చింది. పులివెందులకు కృష్ణా జలాలు ఇవ్వాలనే పట్టుదలతో పనిచేశారు. ఎక్కువ సార్లు వైఎస్ కుటుంబంపై ఓడిపోయిన సానుభూతి కూడా సతీష్ పై ఉంది. ఇవన్నీ కలిసి తమ ఓటు బ్యాంక్ ఈసారి బాగా పెరుగుతుందని తెదేపా అంచనాతో ఉంది. ఇప్పటికే రెండు మండలాల్లో పట్టు సంపాదించారు. జగన్ మెజార్టీని కనీసం 20వేలు తగ్గించాలని భావిస్తున్నారు. జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసు తేలక పోవడంతో దీని ప్రభావం పోలింగ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ఆందోళన వైకాపా శ్రేణుల్లో ఉంది.
ప్రొద్దుటూరు ప్రజాభిమానం ఎవరికి..
నియోజకవర్గంలో తెదేపాకు ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ పార్టీనేతల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు వైకాపాకు లాభిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తెదేపా అభ్యర్థిగా బరిలో ఉండగా.... వరదరాజులరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ వరదరాజులరెడ్డి పార్టీ గెలుపు కోసం ఏ మేరకు పని చేస్తారనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. వైకాపా తరపున రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఆ పార్టీలో పోటీ లేకపోవడం... ప్రజా సమస్యలపై ఆందోళనలు తీవ్రం చేయడంతో ప్రజల మన్ననలు చూరగొన్నారు.
మైదుకూరు ఎవరిది
మైదుకూరు నియోజకవర్గంలో తెదేపా ఇన్ ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ తమ సామాజిక వర్గానికి దగ్గర కావడం సహా ఆర్థికంగా బలంగా ఉండటంతో గెలుపు అవకాశాలపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇటీవలే జగన్ సమక్షంలో వైకాపాలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. అయినా ఆర్థికంగా బలంగా ఉన్న తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ను ఎదుర్కోవడం వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డికి అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని పుట్టా ధీమాగా ఉన్నారు.
కమలాపురంలో పాగా వేసేదెవరు..
కమలాపురం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా పుత్తా నరసింహారెడ్డి బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా పుత్తాకు సహకరిస్తానని మాట ఇవ్వడంతో ఇక్కడ పార్టీకి బలం చేకూరుతోంది. వైకాపా నుంచి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి బరిలో నిలిచారు. కానీ తెదేపాలో ఇద్దరు బలమైన నేతలు, కార్యకర్తల బలం ఉన్నప్పటికీ... ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు పనిచేయరనే అపవాదు ఉంది. 2104లోనూ అదే జరిగింది. వైకాపా ఎమ్మెల్యేకు స్థానికేతరుడు అనే వాదనను తెదేపా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది.
కడప బాద్​షా ఎవరు
కడప నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా అమీర్ బాబు బరిలో ఉండగా... వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషా పోటీ పడుతున్నారు. కడపలో బలహీనంగా ఉన్న తెదేపాను గట్టెక్కించేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు పార్టీలో చేరుతుండటం తెదేపాకు లాభించే అంశం. మైనారిటీలు 60 వేలు, బలిజ సామాజిక వర్గం 50 వేల వరకు ఓట్లు ఉండగా... వైకాపా ముస్లిం ఓట్లపై దృష్టి సారించింది.
బద్వేల్ బరి ఎవరికి అనుకూలం?
బద్వేలు బరిలో తెదేపా తరఫున డాక్టర్ రాజశేఖర్, వైకాపా తరపున వైద్యుడు వెంకటసుబ్బయ్య బరిలో ఉన్నారు. ఈసారి ఇద్దరు అభ్యర్థులు కొత్తవారే కావడంతో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తిగా మారింది.
రాజంపేట రాజకీయం
2104లో తెలుగుదేశం పార్టీ గెలుపొందిన ఏకైక నియోజకవర్గం రాజంపేట. తెదేపా ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఇటీవల వైకాపాలో చేరి... ఫ్యాన్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఆర్థికంగా బలమైన నేత కూడా కావటంతో... వైకాపాకు కలిసొచ్చే అంశం. తెదేపా తరపున మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు బరిలో నిలిచారు. ఈయన స్థానికేతరుడు కావడంతో ఆయన సామాజిక వర్గంలోనే అసమ్మతి గళం వినిపిస్తోంది. అయినప్పటికీ ప్రచారంలో దూసుకు పోతున్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థి సత్యప్రభ కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో తెదేపాకు కలిసొచ్చే అంశం.
కోడూరులో నిలిచేదెవరు
తెదేపా తరఫున చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్, వైకాపా తరఫున కొరముట్ల శ్రీనివాసులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 1900 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈసారి కచ్చితంగా గెలుస్తామనే ధీమా పార్టీలో వ్యక్తం అవుతోంది.
రాయచోటి - చోటెవ్వరికి..? .
రాయచోటి నుంచి తెదేపా తరఫున మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డి, వైకాపా తరఫున శ్రీకాంత్ రెడ్డి బరిలో నిలిచారు. అసమ్మతితో ఉన్న తెదేపా నేత ప్రసాద్ బాబుకు తితిదే పాలక మండలి సభ్యుడి పదవి ఇవ్వటం, ఎమ్మెల్సీ సైతం ఇస్తానని హామీ ఇవ్వడంతో పాలకొండ్రాయుడు వర్గం రమేశ్ రెడ్డి వైపు ఉండటం పార్టీకి కలిసొచ్చే అంశం. ఈసారి జగన్ గాలిపైనే... శ్రీకాంత్ రెడ్డి ఆధారపడ్డారు. 40 వేల ముస్లిం ఓట్లను నమ్ముకున్నారు.

Intro:AP_GNT_28A_07_LOKESH_ON_AGRIGOLD_AVB_C10

CENTRE. MANGALAGIRI

RAMKUMAR. 8008001908

Body:script

Conclusion:FTP lo vachindi
Last Updated : Apr 8, 2019, 12:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.