రాష్ట్రంలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన సాగించాలని చూస్తే సహించేది లేదని పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శ్రీనివాస గార్డెన్ కల్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. దీనికి పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరయ్యారు. ఆరునెలలుగా కూల్చివేతలతో ప్రభుత్వ పాలన సాగుతోందని... ఇపుడు తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాల్సిన ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు... ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో తాము ఈవిధంగా పాలన సాగించి ఉంటే ఒక్క వైకాపా కార్యకర్త మిగిలేవాడా అని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆరునెలల కాలంలో తెదేపా కార్యకర్తలపై 640 కేసులు పెట్టారని... వారిని ఆర్థికంగా దెబ్బతీయడమే సీఎం ఉద్దేశంగా ఉందని పేర్కొన్నారు. అధికారులు చట్టపరంగా నడుచుకోవాలని... లేదంటే వారు పదవీ విరమణ చెందినా కేసులు వెంటాడతాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి
"మేము అలా చేస్తే వైకాపాకు ఒక్క కార్యకర్త మిగిలేవాడా?" - వైకాపాపై చంద్రబాబు తీవ్ర విమర్శలు వార్తలు
ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెదేపా కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ధ్వజమెత్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.