కడప శివారులోని వైఎస్సార్ కాలనీకి చెందిన భార్యాభర్తలు శనివారం మృతి చెందారు. భర్త మహమ్మద్ పీరా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా... భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పీరాకు ఇది వరకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భార్యలు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా... కొంత కాలం కిందట పర్విన్ అనే మరో మహిళను అతను మూడో వివాహం చేసుకున్నాడు. శనివారం వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం వీరిద్దరు చనిపోయారు. భార్య శరీరంపై గాయాలు ఉన్నట్లు కడప పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :