Samantha In Kadapa: సినీనటి సమంత కడపలో సందడి చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. సమంతను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు షాపింగ్ మాల్‌కు తరలి వచ్చారు.
సమంత రాకతో యువత కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కాసేపు స్టేజీపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం షాపింగ్ మాల్ లో ప్రారంభించారు. మాట్లాడిన సమంత కడపలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనతికాలంలోనే మాంగళ్య షాపింగ్ మాల్ ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: AWARDS TO SCR: ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ అవార్డులు