ETV Bharat / city

భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. 31మంది అరెస్టు

author img

By

Published : Dec 2, 2020, 8:54 PM IST

కడప జిల్లా పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. జిల్లాకు చెందిన 28 మంది స్మగ్లర్లు, బెంగళూరులోని కటిగనహళ్లి ప్రాంతానికి ఇద్దరు బడా స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలంలోని గర్నిమిట్టలో అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్​ని పోలీసులు అరెస్టు చేశారు.

Heavy red sandalwood logs seized .. 31 arrested
భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. 31మంది అరెస్టు
ఎస్పీ అన్బురాజన్

కడప జిల్లా పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 4 కోట్ల రూపాయల విలువ చేసే 4 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోని... 30 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఖలీల్ ఖాన్, అప్రోజ్ ఖాన్ ఉన్నారు. జిల్లాలోని మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్లను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

జిల్లాకు చెందిన 28 మంది స్మగ్లర్లు, బెంగళూరులోని కటిగనహళ్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు బడా స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితుల నుంచి ఐదు వాహనాలు, నాలుగు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా ఈ ముఠా సభ్యులు జిల్లా నుంచి ఎర్రచందనాన్ని నరికి బెంగళూరు కేంద్రంగా విదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరిలో ఆరుగురిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తున్నామని వివరించారు.

చిత్తూరు జిల్లాలో...

చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలంలోని గర్నిమిట్టలో అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్​ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి.. యర్రావారిపాళ్యం మండలంలోని పులిబోనుపల్లికి చెందిన ఉయ్యాల సుబ్రమణ్యంగా గుర్తించారు. గత 17 సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్నాడు. 12 కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండీ...

అనుమానాస్పదంగా ఎర్రచందనం కూలీ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.